NADA: అథ్లెట్ షీనాపై నిషేధం
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:02 AM
భారత ట్రిపుల్ జంపర్ షీనా వర్కేపై జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) నిషేధం విధించింది.
న్యూఢిల్లీ: భారత ట్రిపుల్ జంపర్ షీనా వర్కేపై జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) నిషేధం విధించింది. కేరళకు చెందిన ఈ 32 ఏళ్ల అథ్లెట్ డోప్ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. 2023 ఆసియాగేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించిన షీనా.. ఇటీవలి జాతీయ క్రీడల్లో రజతం, ఫెడరేషన్ కప్‌లో కాంస్యం గెలుచుకుంది.