Share News

WTT Star Contender: భారత జోడీలకు రన్నరప్‌ టైటిళ్లు

ABN , Publish Date - Aug 04 , 2025 | 02:43 AM

బ్రెజిల్‌లో జరిగిన ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) స్టార్‌ కంటెండర్‌ టోర్నీలో భారత జోడీలు రన్నరప్‌ టైటిళ్లతో సరిపెట్టుకున్నాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో భారత ద్వయం...

WTT Star Contender: భారత జోడీలకు రన్నరప్‌ టైటిళ్లు

న్యూఢిల్లీ: బ్రెజిల్‌లో జరిగిన ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) స్టార్‌ కంటెండర్‌ టోర్నీలో భారత జోడీలు రన్నరప్‌ టైటిళ్లతో సరిపెట్టుకున్నాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో భారత ద్వయం మానుష్‌ షా/దియా చిటాలే 4-11, 11-8, 11-5, 5-11, 2-11తో జపాన్‌ జంట సతోషి/హొనొకొ చేతిలో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్‌ టైటిల్‌పోరులో భారత జోడీ మానుష్‌/మానవ్‌ 3-11, 11-7, 7-11, 15-13, 5-11తో జర్మనీకి చెందిన బెనెడిక్ట్‌/డాంగ్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇక మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో మనికా బాత్రా 7-11, 6-11, 7-11తో హషిమోటో (జపాన్‌) చేతిలో ఓడింది.

ఇవి కూడా చదవండి..

గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..

ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 04 , 2025 | 02:43 AM