Asian Under 15 Championship: భారత బాక్సర్ల జోరు
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:42 AM
ఆసియా అండర్-15 చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ముగ్గురు బాలురు, ఇద్దరు బాలికలు సెమీఫైనల్స్‌లో చేరారు.
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా అండర్-15 చాంపియన్‌షి్‌ప్సలో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. ముగ్గురు బాలురు, ఇద్దరు బాలికలు సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. 55 కిలోల్లో నెల్సన్, 61 కిలోల్లో అభిజిత్, 64 కిలోల్లో లక్షయ్ ఫొగట్ సెమీ్‌సకు దూసుకుపోయారు. బాలికల విభాగంలో..ప్రిన్సి (52కి.), సమృద్ధి సతీష్ (55) చివరి నలుగురిలో ప్రవేశించారు. అండర్-15 విభాగంలో ఇప్పటికే ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.