Share News

India women Hockey: విజయంతో ఆరంభించాలని..

ABN , Publish Date - Sep 05 , 2025 | 02:58 AM

ఇటీవలి కాలంలో ఓటములతో డీలాపడ్డ భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం నుంచి జరిగే ఆసియా కప్‌..

India women Hockey: విజయంతో ఆరంభించాలని..

  • థాయ్‌లాండ్‌తో భారత్‌ తొలిమ్యాచ్‌

  • నేటి నుంచి మహిళల ఆసియా కప్‌ హాకీ

హాంగ్‌ఝౌ (చైనా): ఇటీవలి కాలంలో ఓటములతో డీలాపడ్డ భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం నుంచి జరిగే ఆసియా కప్‌ను విజయంతో ఆరంభించాలనుకొంటోంది. పూల్‌-బిలో థాయ్‌లాండ్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో వరల్డ్‌ నెం:9 భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. జపాన్‌, సింగపూర్‌ కూడా ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. పూల్‌-ఎలో చైనా, కొరియా, మలేసియా, చైనీస్‌ తైపీ జట్లున్నాయి. ఈ నెల 14న ఫైనల్‌ జరుగుతుంది. వచ్చే ఏడాది బెల్జియంలో జరిగే వరల్డ్‌ కప్‌నకు క్వాలిఫయింగ్‌ టోర్నీ కావడంతో ప్రతి జట్టుకూ ఇది కీలకంగా మారింది. వెటరన్‌ గోల్‌ కీపర్‌ సవిత, ఏస్‌ డ్రాగ్‌ ఫ్లికర్‌ దీపిక గాయాలతో టోర్నీకి దూరం కావడం భారత్‌కు దెబ్బగానే పరిగణించాలి. వీరి గైర్హాజరీలో కెప్టెన్‌ సలీమా టెటే, నవ్‌నీత్‌ కౌర్‌, ఉదిత, షర్మిలా దేవి, లాల్‌ రిమ్సియామి జట్టు బాధ్యత తీసుకోవాల్సి ఉంది. భారత జట్టు 2004, 2017లో ఆసియా కప్‌ విజేతగా నిలిచింది.

Updated Date - Sep 05 , 2025 | 02:58 AM