వన్డేల్లోనూ అదరగొట్టాలని
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:08 AM
ఇంగ్లండ్‌పై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత మహిళల జట్టు.. వన్డే సిరీ్‌సలోనూ అదే జోరును కొనసాగించాలనుకొంటోంది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా...
సా. 5.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
నేడు ఇంగ్లండ్‌తో భారత్ తొలి మ్యాచ్
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌పై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత మహిళల జట్టు.. వన్డే సిరీ్‌సలోనూ అదే జోరును కొనసాగించాలనుకొంటోంది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగనుంది. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో జట్టులోని లోపాలను మరింతగా సవరించుకోవాలని భారత జట్టు భావిస్తోంది. గత మేలో శ్రీలంక, దక్షిణాఫ్రికాలతో జరిగిన ముక్కోణపు సిరీ్‌సలో భారత్ చివరిసారిగా వన్డేల్లో తలపడింది. ఆ టైటిల్ నెగ్గిన హర్మన్‌సేన ఇప్పుడు ఈ సిరీస్ కూడా నెగ్గితే.. ప్రపంచక్‌పనకు ముందు ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఓపెనర్‌గా షఫాలీ స్థానంలో ప్రతికా రావల్ జట్టులోకి రానుంది. స్మృతి మంధాన, హర్మన్, జెమీమా, రిచా ఘోష్‌లతో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. స్పిన్నర్లు శ్రీచరణి, రాధా యాదవ్ కీలకం కాగా.. పేస్ విభాగంలో రేణుక, పూజా వస్త్రాకర్ లేనిలోటు కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకొన్న కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్‌తోపాటు ఎకెల్‌స్టోన్ రీఎంట్రీతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలం పెరిగింది.
ఇవీ చదవండి:
లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి