Share News

India Women Tennis: రష్మిక బృందం మరో గెలుపు

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:01 AM

బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌లో భారత మహిళల జట్టు చైనీస్‌ తైపీపై 2-1 తేడాతో విజయం సాధించింది. వైదేహి, రష్మిక సింగిల్స్‌ మ్యాచ్‌లలో గెలవగా, డబుల్స్‌లో భారత జోడీ ఓడింది

India Women Tennis: రష్మిక బృందం మరో గెలుపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌లో భారత మహిళల టెన్నిస్‌ జట్టు 2-1తో చైనీస్‌ తైపీను ఓడించి ఈ పోటీల్లో మూడో విజయాన్ని అందుకుంది. శుక్రవారం పుణెలో జరిగిన ఈ పోటీల్లో రష్మిక బృందం సింగిల్స్‌లో గెలవగా డబుల్స్‌లో ఓడింది. తొలి సింగిల్స్‌లో వైదేహి 6-2, 5-7, 6-4తో ఫాంగ్‌ లిన్‌పై, రెండో సింగిల్స్‌లో రష్మిక 6-2, 7-6తో జోయన్నాపై నెగ్గారు. డబుల్స్‌లో అంకిత-ప్రార్థన జోడీ ఓటమి పాలైంది.

Updated Date - Apr 12 , 2025 | 04:01 AM