ఆసియా షూటింగ్‌లో భారత్‌కు రజతం
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:05 AM
ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌ప పిస్టల్ విభాగంలో భారత పురుషుల జట్టు రజత పతకంతో బోణీ చేసింది.
షిమ్కెంట్ (కజకిస్థాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌ప పిస్టల్ విభాగంలో భారత పురుషుల జట్టు రజత పతకంతో బోణీ చేసింది. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో అన్మోల్, అదిత్య, సౌరభ్ చౌధరితో కూడిన భారత త్రయం రెండోస్థానంతో రజతం అందుకుంది. చైనా స్వర్ణం, ఇరాన్ కాంస్యం నెగ్గాయి. ఇక, జూనియర్ పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కపిల్ స్వర్ణం, గవిన్ కాంస్యం అందుకున్నారు. ఇదే విభాగం టీమ్ ఈవెంట్‌లో భారత్ రజతం దక్కించుకుంది.