Share News

రెండోదీ మనదే

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:29 AM

అమన్‌జోత్‌ కౌర్‌ (63 నాటౌట్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (63) అర్ధ శతకాలు నమోదు చేయడంతో.. ఇంగ్లండ్‌పై భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం రాత్రి...

రెండోదీ మనదే

24 రన్స్‌తో భారత్‌ గెలుపు

ఇంగ్లండ్‌తో టీ 20

బ్రిస్టల్‌: అమన్‌జోత్‌ కౌర్‌ (63 నాటౌట్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (63) అర్ధ శతకాలు నమోదు చేయడంతో.. ఇంగ్లండ్‌పై భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లో భారత్‌ 24 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (3), స్మృతి మంధాన (13)తోపాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (1) విఫలమయ్యారు. అయితే, జెమీమా, అమన్‌ నాలుగో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. ఛేదనలో ఇంగ్లండ్‌ ఓవర్లన్నీ ఆడి 157/7 స్కోరు మాత్రమే చేసింది. శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది.

భారత్‌: 20 ఓవర్లలో 181/4 (అమన్‌జోత్‌ 63 నాటౌట్‌, జెమీమా 63; బెల్‌ 2/17).

ఇంగ్లండ్‌: 20 ఓవర్లలో 157/7 (బ్యూమాంట్‌ 54, ఎకెల్‌స్టోన్‌ 35; శ్రీచరణి 2/28).

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 04:29 AM