ఫేవరెట్ భారత్
ABN , Publish Date - May 11 , 2025 | 05:25 AM
బ్యాటింగ్ బలంతో సాగుతున్న భారత మహిళల జట్టు.. ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్...
శ్రీలంకతో ఫైనల్ నేడు
మహిళల ముక్కోణపు సిరీస్
ఉదయం 10 గం. నుంచి
కొలంబో: బ్యాటింగ్ బలంతో సాగుతున్న భారత మహిళల జట్టు.. ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరగనుండడంతో.. ఇరుజట్లూ ఈ టోర్నీని సన్నాహకంగా భావిస్తున్నాయి. ప్రత్యర్థితో పోల్చుకొంటే భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాటర్లు ప్రతీక, స్మృతి మంధాన, దీప్తి, జెమీమా ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం శుభారంభాలను భారీస్కోర్లుగా మలచాల్సిన అవసరముంది. బౌలర్లలో స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్ కీలకం కానున్నారు. మరోవైపు శ్రీలంక నిలకడలేమితో ఇబ్బందులు పడుతోంది. ఆఖరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. హర్షిత సమరవిక్రమ, కెప్టెన్ చమరి ఆటపట్టు, నీలాక్షికపై బ్యాటింగ్ భారం ఆధారపడి ఉంది. అయితే, లీగ్ దశలో భారత్‌కు లంక షాకిచ్చింది. ఈ నేపథ్యంలో లంకను ఏమాత్రం తేలిగ్గా తీసుకొన్నా భంగపాటు తప్పదు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి.