Share News

Ind Vs SA T20: పది ఓవర్లు పూర్తి.. 90 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా

ABN , Publish Date - Dec 11 , 2025 | 07:45 PM

దక్షిణాఫ్రికా తన దూకుడును కొనసాగిస్తోంది. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 90 పరుగులు చేసింది. డికాక్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు.

Ind Vs SA T20: పది ఓవర్లు పూర్తి.. 90 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
Ind VS SA Second T20

ఇంటర్నెట్ డెస్క్: డికాక్ అండగా నిలవడంతో దక్షిణాఫ్రికా నిలకడగా పరుగులు రాబడుతోంది. పది ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. డికాక్ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. డికాక్(67), మార్‌క్రమ్ (14)ల భాగస్వామ్యం 50 పరుగులకు చేరింది. భారీ స్కోరు దిశగా ఇద్దరూ వ్యూహాత్మకంగా ఆడుతున్నారు. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే (Ind Vs SA Second T20).


తొలి నుంచీ దూకుడే లక్ష్యంగా సఫారీలు బరిలోకి దిగారు. డికాక్, హెండ్రిక్స్ మొదటి ఓవర్ నుంచే దూకుడు చూపించే ప్రయత్నం చేశారు. అయితే, ఐదో ఓవర్‌లో హెండ్రిక్స్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి వేసిన తొలి బంతికి హెండ్రిక్స్ (8) క్లీన్ బౌల్డ్ కావడంతో దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, మరో ఎండ్‌లో డికాక్ మాత్రం సమయానుకూలంగా బౌండరీలు రాబడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. తొమ్మిదో ఓవర్‌లో పాండ్య వేసి బంతిని ఫోర్‌గా మలిచి అర్ధశతకాన్ని అందుకున్నాడు.

Updated Date - Dec 11 , 2025 | 08:06 PM