Ind Vs SA T20: కష్టాల్లో భారత్.. పది ఓవర్లు ముగిసేసరికి..
ABN , Publish Date - Dec 11 , 2025 | 10:10 PM
టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో భారత్ కష్టాల్లో పడింది. పది ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ధాటికి ఘోరంగా తడబడుతోంది. 214 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. తొలి ఓవర్‌లో ఎండిగి బౌలింగ్‌లో గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత రెండో ఓవర్‌లో యాన్సెన్ బౌలింగ్‌లో అభిషేక్ కూడా 17 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.
ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌ను (5) కూడా యాన్సెన్ నాలుగో ఓవర్‌లో పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత అక్షర్ రూపంలో భారత్ మరో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. టాప్ ఆర్డర్ ఇలా కుప్పకూలడంతో భారత్ ఒక్కసారిగా చిక్కుల్లో పడిపోయింది. పది ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ నష్టానికి 81 పరుగులు చేయగలిగింది. క్రీజులో తిలక్ (32), హార్దిక్ (4) ఉన్నారు. ఇన్నింగ్స్ కాపాడుకునే ప్రయత్నంలో నిలకడగా ఆడుతున్నారు.