Asia cup Ind Vs Pak: నిలకడగా ఆడుతున్న పాక్.. పవర్ ప్లే ముగిసే సరికి పాక్ స్కోరు ఇదీ..
ABN , Publish Date - Sep 28 , 2025 | 08:35 PM
పాక్ ప్లేయర్లు నిలకడగా ఆడుతున్నారు. ఐదు ఓవర్లు ముగిసే సరికి పాక్ 37 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫకార్ జమాన్‌లు నిలకడగా ఆడుతూనే క్రమం తప్పకుండా బౌండరీలు సాధిస్తున్నారు. పటిష్ఠ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తూ భారత్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. దూబే వేసిన తొలి ఓవర్‌లోనే బౌండరీ (4) బాదిన ఫర్హాన్ దూకుడు ప్రారంభించాడు. ఆ తరువాత ఓవర్లలో కూడా క్రమం తప్పకుండా బౌండీలు బాదుతూ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు.
మరో ఎండ్‌లో ఫకార్ జమాన్ కాస్త ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నా పాక్ ప్లేయర్లు టీమిండియాపై ఒత్తిడి పెంచుతున్నారు. ఫలితంగా ఆరు ఓవర్లు ముగిసే సరికి పాక్ 45 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో ఉంది. ఫర్హాన్ (31), జమాన్ (12) నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు.