Share News

Mohit Sharma Retirement: క్రికెట్‌కు మోహిత్‌ శర్మ గుడ్‌బై

ABN , Publish Date - Dec 04 , 2025 | 05:59 AM

టీమిండియా వెటరన్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. హరియాణాకు చెందిన 35 ఏళ్ల మోహిత్‌.. 34 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం...

Mohit Sharma Retirement: క్రికెట్‌కు మోహిత్‌ శర్మ గుడ్‌బై

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. హరియాణాకు చెందిన 35 ఏళ్ల మోహిత్‌.. 34 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. 26 వన్డేలాడి 31 వికెట్లు తీసిన అతను.. 8 టీ20ల్లో 6 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 2015 వన్డే వరల్డ్‌క్‌పలోనూ సభ్యుడిగా ఉన్న మోహిత్‌.. ఆ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. చివరిగా 2015లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మోహిత్‌.. ఆ తర్వాత ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా ఆడుతూ వచ్చాడు. ఈ ఏడాది గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడాడు.

ఇవి కూడా చదవండి:

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 04 , 2025 | 05:59 AM