India T20 World Cup Jersey: టీ20 వరల్డ్‌కప్ జెర్సీ ఆవిష్కరణ
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:02 AM
వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ కోసం రూపొందించిన భారత జట్టు కొత్త జెర్సీని రోహిత్ శర్మ ఆవిష్కరించాడు. బుధవారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో...
రాయ్‌పూర్: వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ కోసం రూపొందించిన భారత జట్టు కొత్త జెర్సీని రోహిత్ శర్మ ఆవిష్కరించాడు. బుధవారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇన్నింగ్స్ విరామం మధ్యలో ఈ కార్యక్రమం జరిగింది. రోహిత్ శర్మ, తిలక్ వర్మకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, అడిడాస్ ఇండియా జీఎం విజయ్ చౌహాన్ కొత్త జెర్సీలను అందించారు. మైదానంలో ఒక భారీ జెర్సీని కూడా ప్రదర్శించారు.
రాణాకు మందలింపు: క్రమశిక్షణ కోడ్‌ను ఉల్లంఘించిన పేసర్ హర్షిత్ రాణాను ఐసీసీ మందలించింది. అంతేకాకుండా అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ చేర్చింది. తొలి వన్డేలో బ్రేవిస్ అవుటైనప్పడు అతడిని రెచ్చగొట్టేలా రాణా వ్యవహరించాడు.
ఇవి కూడా చదవండి:
ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!
ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ