Share News

India Defeated Australia: సిరీస్‌ ఇక పదిలమే..

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:38 AM

సూర్యకుమార్‌ నేతృత్వంలోని భారత టీ20 జట్టు ఇప్పటిదాకా సిరీ్‌సను కోల్పోలేదు. అలాగే ఆసీస్‌ గడ్డపైనా ఈ ఫార్మాట్‌లో అజేయంగా ఉన్న రికార్డుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు...

India Defeated Australia: సిరీస్‌ ఇక పదిలమే..

  • 2-1తో ఆధిక్యం జూ చెలరేగిన బౌలర్లు

  • భారత్‌ ఘనవిజయం జూ ఆసీ్‌సతో నాలుగో టీ20

గోల్డ్‌కోస్ట్‌: సూర్యకుమార్‌ నేతృత్వంలోని భారత టీ20 జట్టు ఇప్పటిదాకా సిరీ్‌సను కోల్పోలేదు. అలాగే ఆసీస్‌ గడ్డపైనా ఈ ఫార్మాట్‌లో అజేయంగా ఉన్న రికార్డుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో బౌలర్లు విశేషంగా రాణించడంతో భారత జట్టు 48 పరుగుల తేడాతో వరుసగా రెండోవిజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీ్‌సలో ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దయిన విషయం తెలిసిందే. శనివారం బ్రిస్బేన్‌లో చివరి మ్యాచ్‌ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. గిల్‌ (39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46), అభిషేక్‌ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28) ఫర్వాలేదనిపించగా.. చివర్లో అక్షర్‌ పటేల్‌ (11 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 21 నాటౌట్‌) వేగంగా ఆడాడు. పేసర్‌ ఎలిస్‌, స్పిన్నర్‌ జంపాలకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మార్ష్‌ (24 బంతుల్లో 4 ఫోర్లతో 30), షార్ట్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25) మాత్రమే రాణించారు. సుందర్‌కు మూడు.. అక్షర్‌, దూబేలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్‌షో కనబర్చిన అక్షర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

స్పిన్‌కు తడబాటు: ఓ మాదిరి ఛేదనను ఆసీస్‌ మెరుగ్గానే ఆరంభించినా మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. ఓపెనర్లు మార్ష్‌, షార్ట్‌ మాత్రమే కాస్త పోరాడగలిగారు. ఈ జోడీ క్రీజులో ఉన్నంత సేపు ఆసీస్‌ విజయంపై ఆశతోనే ఉంది. పవర్‌ప్లేలో షార్ట్‌ను అక్షర్‌ అవుట్‌ చేయగా, కాసేపటికే వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇన్‌గ్లి్‌స (12)ను కూడా దెబ్బతీశాడు. మరోవైపు జోరు మీదున్న మార్ష్‌, టిమ్‌ డేవిడ్‌ (14)లను శివమ్‌ దూబే తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్‌ ఛేదనపై ప్రభావం చూపింది. ఇక 14వ ఓవర్‌లో ఫిలిప్‌ (10)ను అర్ష్‌దీప్‌ అవుట్‌ చేశాక వికెట్ల పతనం వేగంగా సాగింది. సిరీ్‌సలో తొలి మ్యాచ్‌ ఆడిన హిట్టర్‌ మ్యాక్స్‌వెల్‌ (2) కేవలం నాలుగు బంతులే ఆడి వరుణ్‌ చేతిలో బౌల్డయ్యాడు. అలాగే 17వ ఓవర్‌లో స్టొయినిస్‌ (17), బార్ట్‌లెట్‌ (0)లను స్పిన్నర్‌ సుందర్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేయడంతో ఆసీస్‌ కోలుకోలేకపోయింది. 16 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ మరో 10 బంతులుండగానే ఓటమిపాలైంది.


ఆకట్టుకున్న గిల్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ ఆశించిన రీతిలో సాగలేదు. పిచ్‌ బ్యాటింగ్‌కు కష్టంగా మారడంతో ఓపెనర్‌ అభిషేక్‌ భారీ షాట్లు ఆడలేకపోయాడు. అటు గిల్‌ మాత్రం ఈసారి మెరుగైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఓ దశలో 121/2 స్కోరుతో పటిష్టంగా కనిపించినా.. చివరి ఆరు ఓవర్లలో 46 పరుగులే చేయగలిగింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే అభిషేక్‌ ఇచ్చిన క్యాచ్‌ను బార్ట్‌లెట్‌ వదిలేశాడు. ముఖ్యంగా గిల్‌ సాధికారికంగా ఆడి నాలుగో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. అటు ఐదో ఓవర్‌లో అభిషేక్‌ సైతం రెండు ఫోర్లతో 11 రన్స్‌ రాబట్టడంతో జట్టు పవర్‌ప్లేలో 49 పరుగులతో నిలిచింది. ఇక జంపా ఓవర్‌లో సిక్సర్‌ బాదిన అభిషేక్‌ మరో షాట్‌కు వెళ్లి లాంగాన్‌లో డేవిడ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనూహ్యంగా వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన దూబే (22) ఉన్న కాసేపు వేగంగా ఆడాలని చూసినా.. పేసర్‌ ఎలి్‌సకు చిక్కాడు. అటు కెప్టెన్‌ సూర్య 13వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో జోష్‌ చూపాడు. అటు తర్వాతి ఓవర్‌లోనే గిల్‌ కూడా సిక్సర్‌ బాది హాఫ్‌ సెంచరీ ఖాయమనిపించాడు. కానీ ఎలిస్‌ విసిరిన స్లో బాల్‌కు క్లీన్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత సూర్య నిష్క్రమించగా, స్పిన్నర్‌ జంపా ఒకే ఓవర్‌లో తిలక్‌ (5), జితేశ్‌ (3)లను పెవిలియన్‌కు చేర్చి షాకిచ్చాడు. అయితే సుందర్‌ (12) అవుటయ్యాక ఆఖరి ఓవర్‌లో అక్షర్‌ 4,6తో 14 రన్స్‌ అందించి జట్టుకు సవాల్‌ విసిరే స్కోరందించాడు.

  • ఆసీస్‌ గడ్డపై గతంలో భారత్‌ ఆడిన నాలుగు టీ20 సిరీ్‌సల్లో రెండు గెలవగా, రెండు సమమయ్యాయి. తాజా సిరీస్‌ను కూడా ఓటమి లేకుండానే

  • ముగించనుంది.

  • స్వదేశంలో జరిగిన టీ20ల్లో ఆసీస్‌కిది రెండో అత్యల్ప స్కోరు (119). గతంలో కివీ్‌సపై 111 పరుగులు చేసింది.

Updated Date - Nov 07 , 2025 | 01:38 AM