Junior Hockey World Cup: స్వదేశంలో మరో టైటిల్ కోసం
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:21 AM
పురుషుల జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నీ శుక్రవారం ఇక్కడ ప్రారంభం కానుం ది. తొమ్మిదేళ్ల తర్వాత స్వదేశంలో టైటిల్ అందుకోవడమే లక్ష్యంగా ఆతిథ్య భారత్ బరిలోకి దిగుతోంది. ఈక్రమంలో...
చిలీతో భారత్ ఆరంభ మ్యాచ్ నేడు
జూనియర్ హాకీ ప్రపంచ కప్
చెన్నై: పురుషుల జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నీ శుక్రవారం ఇక్కడ ప్రారంభం కానుం ది. తొమ్మిదేళ్ల తర్వాత స్వదేశంలో టైటిల్ అందుకోవడమే లక్ష్యంగా ఆతిథ్య భారత్ బరిలోకి దిగుతోంది. ఈక్రమంలో శుక్రవారం జరిగే ఆరంభ మ్యాచ్‌లో చిలీతో తలపడుతోంది. 2016లో లఖ్‌నవూ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షి్‌పలో చివరిసారి భారత్ టైటిల్ దక్కించుకుంది. పూల్ ‘బి’లో చిలీ, ఒమన్, స్విట్జర్లాండ్‌తో కలిసి భారత్ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వాస్తవంగా ఈ పూల్‌లో పాకిస్థాన్ కూడా ఉంది. కానీ భద్రతా కారణాలతో ఆ జట్టు వైదొలగడంతో ఒమన్‌కు స్థానం కల్పించారు. చెన్నై, మధురైలలో జరిగే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 24 జట్లు తలపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!
కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ