Share News

నాకౌట్‌ చేరువలో భారత్‌

ABN , Publish Date - Oct 08 , 2025 | 02:35 AM

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో యువ భారత జట్టు వరుసగా రెండో విజయంతో నాకౌట్‌ బెర్త్‌కు చేరువైంది....

నాకౌట్‌ చేరువలో భారత్‌

శ్రీలంకపై విజయం జూప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌

గువాహటి: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో యువ భారత జట్టు వరుసగా రెండో విజయంతో నాకౌట్‌ బెర్త్‌కు చేరువైంది. గ్రూప్‌-హెచ్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో భారత్‌ 45-27, 45-21తో శ్రీలంకపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తుచేసిన భారత్‌.. తాజా ప్రదర్శనతో తన గ్రూప్‌లో టాపర్‌గా నిలిచింది. భారత్‌ తన గ్రూప్‌లో ఆఖరిదైన మూడో మ్యాచ్‌ను బుధవారం యూఏఈతో ఆడనుంది. కాగా ఈ టోర్నీకి మ్యాచ్‌ కంట్రోల్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంఎస్‌ఎన్‌ ప్రసాద్‌ వ్యవహరిస్తున్నారు.

Updated Date - Oct 08 , 2025 | 02:35 AM