Share News

హాకీలో అదే వరస

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:37 AM

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత హాకీ జట్లకు మళ్లీ ఓటమి ఎదురైంది. పురుషుల జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూడగా..

హాకీలో అదే వరస

ప్రొ. లీగ్‌లో పురుషులు, మహిళల జట్ల ఓటమి

లండన్‌/ఆంట్వెర్ప్‌: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత హాకీ జట్లకు మళ్లీ ఓటమి ఎదురైంది. పురుషుల జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూడగా.. మహిళల బృందం వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. లండన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు 1-2తో ఆస్ట్రేలియా ధాటికి తలొంచారు. యూరోపియన్‌ లెగ్‌లో భాగంగా ఆదివారం బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 2-3తో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది. భారత్‌ ఇప్పటికే నెదర్లాండ్స్‌, అర్జెంటీనా జట్లతో రెండేసి మ్యాచ్‌లను కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

ఐదేళ్లలో 6 ఐసీసీ టోర్నీలు

వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 03:37 AM