India vs South Africa: సిరీస్ పట్టేస్తారా?
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:35 AM
బౌలర్లు గాడిలో పడడంతో పైచేయి సాధించిన భారత్.. స్వదేశంలో మరో పొట్టి సిరీ్‌సపై గురిపెట్టింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే నాలుగో టీ20లో గెలిచి..
నాలుగో టీ20 నేడురాత్రి 7 నుంచిస్టార్‌స్పోర్ట్స్‌లో..
సూర్య, గిల్ ఫామ్ ఆందోళనకరం
బుమ్రా డౌటే ఫ సమంపై దక్షిణాఫ్రికా గురి
లఖ్‌నవూ: బౌలర్లు గాడిలో పడడంతో పైచేయి సాధించిన భారత్.. స్వదేశంలో మరో పొట్టి సిరీ్‌సపై గురిపెట్టింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే నాలుగో టీ20లో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీ్‌సను సొంతం చేసుకోవాలనుకొంటోంది. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే, గిల్ వైఫల్యాలు ఇప్పటికే చర్చనీయాంశం కాగా.. కెప్టెన్ సూర్యకుమార్ పేలవ ఫామ్ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ బుమ్రా ఆడే పరిస్థితి లేకపోవడంతో అర్ష్‌దీప్, హర్షిత్‌లను కొనసాగించవచ్చు. లఖ్‌నవూ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని కుల్దీప్ స్థానంలో సుందర్ తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు సౌతాఫ్రికా సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే, జట్టులో తరచూ మార్పులు సఫారీల బ్యాటింగ్‌ను దెబ్బతీస్తోంది.