India Versus Australia T20 Series: గాబాలోనూ మురిపిస్తారా
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:29 AM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ దక్కించుకునేందుకు టీమిండియా మరో విజయం దూరంలోనే ఉంది. శనివారం ఇరు జట్ల మధ్య జరిగే ఆఖరి మ్యాచ్‌కు ప్రఖ్యాత గాబా మైదానం...
సిరీ్‌సకు విజయం దూరంలో భారత్
మధ్యాహ్నం 1.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
సమం చేసేందుకు ఆసీస్ ఆరాటం
నేడు ఇరు జట్ల మధ్య ఐదో టీ20
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ దక్కించుకునేందుకు టీమిండియా మరో విజయం దూరంలోనే ఉంది. శనివారం ఇరు జట్ల మధ్య జరిగే ఆఖరి మ్యాచ్‌కు ప్రఖ్యాత గాబా మైదానం వేదిక కానుంది. ఇప్పటికే సూర్య సేన 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే విదేశీ గడ్డపై మరో సిరీస్ సాధించాలనుకుంటున్న భారత్ ముందుగా తమ బ్యాటింగ్ పటిష్టతపై దృష్టి సారించాల్సి ఉంది. అటు ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు భారత స్పిన్నర్లను ఎదుర్కోలేక వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడాల్సి వచ్చింది. నేటి కీలక పోరులో ఈ బలహీనతను అధిగమించకుంటే కంగారూలు హ్యాట్రిక్ ఓటమితో సిరీస్ కోల్పోక తప్పదు. టీ20 వరల్డ్‌క్‌పనకు ముందు ఇరు జట్ల మధ్య ఇదే చివరి మ్యాచ్. మరోవైపు గాబాలో ఆసీస్‌కు అద్భుత రికార్డే ఉంది. ఇక్కడ ఆడిన ఎనిమిది టీ20ల్లో ఆ జట్టు ఒక్కసారే ఓడడం గమనార్హం.
మిడిలార్డర్ కుదురుకుంటే..: భారత జట్టు బ్యాటింగ్ లైనప్ కాగితంపై పటిష్టంగానే కనిపిస్తోంది. కానీ ఇప్పటిదాకా సిరీ్‌సలో సమష్ఠిగా రాణించిన సందర్భం లేదు. గోల్డ్‌కోస్ట్ మ్యాచ్‌లో గిల్ తొలిసారిగా ఆకట్టుకున్నాడు. అయితే 121/2తో మెరుగ్గా కనిపించిన జట్టు 15 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోవడం ఆందోళనకరం. అభిషేక్ ఒక్కడే అంచనాలను అందుకుంటున్నాడు. సూర్యకుమార్ బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. మిడిలార్డర్‌లో తిలక్ 0, 29, 5 స్కోర్లతో నిరాశపరిచాడు. కీపర్ జితేశ్ రెండు మ్యాచ్‌లాడినా ప్రభావంచూపలేకపోయాడు. దూబే బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. లోయరార్డర్‌లో ఆల్‌రౌండర్లు అక్షర్, సుందర్ పరుగులు రాబడుతున్నారు. అయితే బౌలర్లు జట్టుకు అండగా నిలుస్తుండడం సానుకూలాంశం కానుంది. పేసర్ అర్ష్‌దీప్ టీమ్ మేనేజ్‌మెంట్ సంతృప్తి చెందేలా రాణిస్తున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు వరుణ్, అక్షర్, సుందర్ జట్టుకు కొండంత అండగా ఉన్నారు. కానీ గాబా పిచ్‌పై వీరు ఏమేరకు రాణించగలరో చూడాల్సిందే. అటు దూబే కీలక సమయాల్లో వికెట్లు తీయగలుగుతున్నాడు. సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో తమ లోపాలను సరిదిద్దుకుని భారత జట్టు విజయంతో ఈ టూర్‌ను ముగించాలనుకుంటోంది.
స్పిన్‌తో సవాల్: ఆతిథ్య ఆసీస్ జట్టు తమకు అలవాటైన పిచ్‌లపై సమర్థంగా ఆడలేకపోతోంది. నాలుగో టీ20లో భారత స్పిన్నర్లను ఎదుర్కోలేక మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అందు కే భారత స్పిన్ త్రయానికి ఆసీస్ ఆరు వికెట్లు సమర్పించుకుంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ మార్ష్, స్టొయినిస్, డేవిడ్‌లపైనే ఆధారపడి ఉంది. మ్యాక్స్‌వెల్ ఫామ్ లేమి గత మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఓపెనర్ హెడ్ అందుబాటులో లేకపోవడం వీరిని దెబ్బతీసింది. శనివారం మ్యాచ్‌లో మ్యాక్సీతో పాటు ఇన్‌గ్లి్‌స సత్తా చూపితేనే ఫలితం ఉంటుంది. స్టార్ పేసర్ హాజెల్‌వుడ్ లేకపోవడంతో బౌలింగ్ బలహీనంగా మారింది. పేసర్ ఎలిస్, స్పిన్నర్ జంపా కీలకంగా మారారు. పేసర్ డ్వార్షుస్ స్థానంలో మహ్లి బియర్డ్‌మన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, దూబే, అక్షర్, సుందర్, జితేశ్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా.
ఆస్ర్టేలియా: మార్ష్ (కెప్టెన్), షార్ట్, ఇన్‌గ్లి్‌స, మ్యాక్స్‌వెల్, డేవిడ్, స్టొయినిస్, ఓవెన్/ఫిలి్‌ప, ఎలిస్, బార్ట్‌లెట్, జంపా, బియర్డ్‌మన్.
పిచ్, వాతావరణం
గాబా పిచ్ సహజంగా పేస్, బౌన్స్‌తో పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు బ్యాటర్లకు కూడా సహకరించనుంది. బిగ్‌బాష్ లీగ్‌లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి