Sultan Azlan Shah Cup: ఫైనల్లో భారత్
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:20 AM
సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్‌లో భారత జట్టు ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన ఆఖరి పూల్ మ్యాచ్‌లో భారత్ 14-3తో కెనడాను చిత్తుగా ఓడించింది. భారత ఆటగాళ్లలో జుగ్రాజ్ సింగ్...
అజ్లాన్ షా హాకీ కప్
ఇపోహ్ (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్‌లో భారత జట్టు ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన ఆఖరి పూల్ మ్యాచ్‌లో భారత్ 14-3తో కెనడాను చిత్తుగా ఓడించింది. భారత ఆటగాళ్లలో జుగ్రాజ్ సింగ్ నాలుగు గోల్స్ (12వ నిమిషం, 26వ, 39వ, 50వ) నాలుగు గోల్స్‌తో చెలరేగగా.. అభిషేక్ (57వ, 59వ) రెండు గోల్స్ చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఆట తొలి 15 నిమిషాల్లోనే భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ప్రధమార్థం ముగిసేసరికి 7-1తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మూడు, నాలుగు క్వార్టర్స్‌లో కలిపి ప్రత్యర్థి రెండే గోల్స్ చేయగా భారత్ మరో ఏడు గోల్స్ చేసి ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో బెల్జియంతో భారత్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?