Share News

Womens Cricket: ఇంగ్లండ్‌ ఉత్కంఠ విజయం

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:00 AM

ఇంగ్లండ్‌పై తొలిసారి టీ20 సిరీ్‌సలో విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఆఖరి మ్యాచ్‌లో పోరాడి ఓడింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా...

Womens Cricket: ఇంగ్లండ్‌ ఉత్కంఠ విజయం

  • ఐదో టీ20లో గెలుపు

  • సిరీస్‌ 3-2తో భారత్‌ కైవసం

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌పై తొలిసారి టీ20 సిరీ్‌సలో విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఆఖరి మ్యాచ్‌లో పోరాడి ఓడింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఐదో టీ20లో భారత్‌ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కానీ, 3-2తో టీ20 సిరీ్‌సను భారత్‌ సొంతం చేసుకొంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (75) మినహా అంతా విఫలమయ్యారు. చార్లీ డీన్‌ 3, ఎకెల్‌స్టోన్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఇంగ్లండ్‌ ఓవర్లన్నీ ఆడి 168/5 స్కోరు చేసి గెలిచింది. దీప్తి శర్మ, అరుంధతి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చివరి 3 బంతుల్లో 5 పరుగులు అవసరమవగా.. ఎకెల్‌స్టోన్‌ (4 నాటౌట్‌) జట్టును గెలిపించింది.

22-sports.jpg

తెలుగమ్మాయి శ్రీ చరణి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచింది.

ఇవీ చదవండి:

రోహిత్ రికార్డుకు పంత్ ఎసరు!

ఒక్క ఓవర్‌కే భయపడతారా?

మ్యాచ్ మధ్యలో బంతుల బాక్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 04:00 AM