భారత్‌దే రెండో వన్డే
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:16 AM
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత జట్టుకు రెండో విజయం దక్కింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్ ప్రతికా రావల్ (78) తన జోరును...
దక్షిణాఫ్రికా ఓటమి
మహిళల ముక్కోణపు సిరీస్
కొలంబో: మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత జట్టుకు రెండో విజయం దక్కింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్ ప్రతికా రావల్ (78) తన జోరును కొనసాగించడంతో పాటు, మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 500 రన్స్ (8 ఇన్నింగ్స్) పూర్తి చేసిన బ్యాటర్‌గానూ నిలిచింది. ఇక బౌలింగ్‌లో స్నేహ్ రాణా (5/43) సఫారీల వెన్నువిరవడంతో భారత్ 15 పరుగులతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 276/6 స్కోరు సాధించింది. హర్మన్ (41), జెమీమా (41), మంధాన (36) రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా పోరాడినా చివర్లో తడబడింది. దీంతో 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. తజ్మిన్ బ్రిట్స్ (109) శతకం వృథా అయ్యింది. వోల్వార్ట్ (43), డెరెక్సెన్ (30) ఫర్వాలేదనిపించారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..