India Clinches Historic Squash World Cup: స్క్వాష్ వరల్డ్ కప్ మనదే
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:12 AM
స్క్వాష్ వరల్డ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. తద్వారా ప్రతిష్ఠాత్మక....
చెన్నై: స్క్వాష్ వరల్డ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. తద్వారా ప్రతిష్ఠాత్మక టైటిల్ అందుకున్న తొలి ఆసియా దేశంగా రికార్డు నెలకొల్పింది. 2023లో సాధించిన కాంస్యమే ఈ టోర్నీ చరిత్రలో మనోళ్ల అత్యుత్తమ ప్రదర్శన. ఈసారి టోర్నమెంట్‌లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన భారత్ ఒక్క మ్యాచ్ కూడా చేజార్చుకోకుండా విజేతగా నిలవడం విశేషం. గ్రూపు దశలో స్విట్జర్లాండ్, బ్రెజిల్‌లను ఓడించిన మనోళ్లు.. క్వార్టర్స్‌లో దక్షిణాఫ్రికాపై, సెమీస్‌లో రెండుసార్లు చాంపియన్ ఈజిప్టుపై విజయం సాధించారు.