Share News

Unofficial Test Match: ఆధిక్యంలో భారత్‌ ఎ

ABN , Publish Date - Nov 08 , 2025 | 03:54 AM

దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత్‌ 112 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. శుక్రవారం రెండో రోజు పేసర్లు చెలరేగడంతో...

Unofficial Test Match: ఆధిక్యంలో భారత్‌ ఎ

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 221

బెంగళూరు: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత్‌ 112 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. శుక్రవారం రెండో రోజు పేసర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఏకర్మన్‌ (134) శతకం సాధించినా.. ప్రసిద్ధ్‌ (3/35), ఆకాశ్‌ (2/28), సిరాజ్‌ (2/61)ల ధాటికి 8 మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆ తర్వాత 34 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ‘ఎ’ ఆట ముగిసే సరికి 78/3 స్కోరుతో నిలిచింది. క్రీజులో రాహుల్‌ (26), కుల్దీప్‌ ఉన్నారు. అంతకుముందు భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి:

ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య

ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 03:54 AM