Share News

Shubman Gill: శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ.. ఇంగ్లండ్‌లో ఆ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్‌..

ABN , Publish Date - Jul 03 , 2025 | 07:20 PM

తొలి టెస్ట్‌లో సెంచరీ చేసిన గిల్ ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న టెస్ట్‌లోనూ తన క్లాస్ చూపిస్తున్నాడు. ఎంతో ఓర్పు, సంయమనంతో చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి రోజే సెంచరీ సాధించాడు. ఈ రోజు డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు

Shubman Gill: శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ.. ఇంగ్లండ్‌లో ఆ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్‌..
Shubman Gill Double Century

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టెస్ట్ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియాను తిరుగులేని స్థానంలో నిలిపాడు. తొలి టెస్ట్‌లో సెంచరీ చేసిన గిల్ ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న టెస్ట్‌లోనూ తన క్లాస్ చూపిస్తున్నాడు (Ind vs Eng). ఎంతో ఓర్పు, సంయమనంతో చూడ చక్కని ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. మొదటి రోజే సెంచరీ సాధించాడు. ఈ రోజు డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు (Shubman Gill Record).


అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ 323 బంతుల్లో 26 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 222 పరుగులతో ఆడుతున్నాడు. టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించడం గిల్‌కు ఇదే తొలిసారి. ఈ క్రమంలో గిల్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గిల్ కంటే ముందు 1990లో అజారుద్దీన్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 179 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఇదే ఇంగ్లండ్‌లో టీమిండియా కెప్టెన్ సాధించిన అత్యధిక స్కోరు. ఆ రికార్డును తాజాగా గిల్ బ్రేక్ చేశాడు.


గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా రెండో టెస్ట్‌లో తిరుగులేని స్థానంలో నిలిచింది. ప్రస్తుతం డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమిండియా 125 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 496 పరుగులతో ఆడుతోంది. గిల్ డబుల్ సెంచరీకి తోడు రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) కీలక పరుగులు చేశారు. ప్రస్తుతం గిల్‌కు తోడుగా వాషింగ్టన్ సుందర్ (23) క్రీజులో ఉన్నాడు. ఈ రోజు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి ఇంగ్లండ్ మీద ఒత్తిడి పెంచడానికి టీమిండియా ప్రయత్నాలు చేస్తోంది.


ఇవీ చదవండి:

సీఎస్‌కేలోకి సంజూ శాంసన్

టీమ్ కంటే బుమ్రా గొప్పా?

బ్యాటింగ్ చేతకాదు: అశ్విన్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 08:38 PM