Ind vs Eng 3rd Test Match: టీమిండియా టార్గెట్ 193.. ఆరంభంలోనే జైస్వాల్ అవుట్..
ABN , Publish Date - Jul 13 , 2025 | 09:45 PM
లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి 193 పరుగుల దూరంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 192 పరుగులకు ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ (4/22) ఇంగ్లండ్ వెన్ను విరిచాడు.
లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా (TeamIndia) విజయానికి 193 పరుగుల దూరంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 192 పరుగులకు ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ (4/22) ఇంగ్లండ్ వెన్ను విరిచాడు (Lords Test Match). తొలి ఇన్నింగ్స్‌లో రెండు జట్లు 387 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 62.1 ఓవర్లు ఆడి 192 పరుగులకు ఆలౌట్ అయింది (Ind vs Eng 3rd Test).
ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ (40), బెన్ స్టోక్స్ (33) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు తీశారు. నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ ఒక్కో వికెట్ తీశారు. మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే 193 పరుగులు అవసరం. మరో రోజు మిగిలి ఉంది. కాగా, బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే జైస్వాల్ వికెట్ కోల్పోయింది.
షార్ట్ పిచ్ బంతిని ఆడడంలో జైస్వాల్ (0) అంచనా తప్పింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ క్రీజులో ఉన్నారు. టార్గెట్ ఊరిస్తున్నప్పటికీ ఇది ఛేదించాలంటే టీమిండియా కాస్త చెమటోడ్చాల్సిందే. లార్డ్స్ మైదానంలో చివరి రోజు ఇంగ్లండ్ క్వాలిటీ బౌలర్లను ఎదుర్కొని ఈ టార్గెట్‌ను ఛేజ్ చేస్తే టీమిండియాకు ఈ సిరీస్‌లో రెండో విజయం దక్కుతుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి