Share News

వన్డేలకే పరిమితమా?

ABN , Publish Date - Mar 11 , 2025 | 03:34 AM

గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ గెలవగానే భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా ముగ్గురూ పొట్టి ఫార్మాట్‌కు బైబై చెప్పారు. ఈసారి కూడా చాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గగానే..

వన్డేలకే పరిమితమా?

గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ గెలవగానే భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా ముగ్గురూ పొట్టి ఫార్మాట్‌కు బైబై చెప్పారు. ఈసారి కూడా చాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గగానే.. ముఖ్యంగా రోహిత్‌ తప్పుకొంటాడంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ అలా ఏమీ జరగలేదు. రిటైర్మెంట్‌పై తానే నేరుగా తేల్చి చెప్పాడు. ‘భవిష్యత్‌ ప్రణాళికలంటూ ఏమీ లేవు. కాలం ఎలా సాగనిస్తే అలా ముందుకెళ్తా. ప్రస్తుతానికైతే వన్డేలకు గుడ్‌బై చెప్పడం లేదు. ఎలాంటి వదంతులు వ్యాప్తిచేయకండి’ అంటూ ఫైనల్‌ గెలిచాక హిట్‌మ్యాన్‌ సూచించాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి 2027 వన్డే వరల్డ్‌కప్‌పై ఉంది. అప్పటి వరకు అతను జట్టులో కొనసాగుతాడా? లేదా? అనే సందేహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఆ మెగా టోర్నీకి ఎక్కువ సమయమే ఉంది. అప్పటికి రోహిత్‌ వయస్సు 40 దరిదాపుల్లో ఉంటుంది. ఆ టోర్నీలో ఆడే విషయమై ఇప్పటికైతే తానేమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. అటు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీ్‌సలను ఘోరంగా ఓడడంతో రోహిత్‌ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.


బ్యాటర్‌గానూ విఫలం కావడంతో ఇక అతను సుదీర్ఘ ఫార్మాట్‌లో కొనసాగేది కష్టమేనని అంతా భావించారు. కానీ టెస్టుల విషయమై ఇప్పటివరకూ అతడు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. వచ్చే జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో సిరీస్‌ ద్వారా డబ్ల్యూటీసీ కొత్త సీజన్‌ ఆరంభం కానుంది. అలాగాకుండా ఒకవేళ వన్డేలకే పరిమితమవుతాడనుకుంటే.. వచ్చే వరల్డ్‌కప్‌ నాటికి భారత జట్టు 27 మ్యాచ్‌లాడుతుంది. ఇందులో మూడు వన్డేల చొప్పున తొమ్మిది ద్వైపాక్షిక సిరీ్‌సలుంటాయి. వీటికి తోడు పరిమిత ఓవర్లలో అదనపు మ్యాచ్‌ సమయం కావాలనుకుంటే ఐపీఎల్‌, విజయ్‌ హజారే ట్రోఫీలోనూ ఆడే చాన్సుంది. రిటైర్మెంట్‌ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమైనప్పటికీ విరాట్‌, రోహిత్‌లాంటి ఆటగాళ్ల విషయంలో చాలా సమీకరణాలుంటాయి. వన్డే వరల్డ్‌క్‌పనకు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో వెళ్లాలని చీఫ్‌ సెలెక్టర్‌, కోచ్‌ భావిస్తే రోహిత్‌ సేవలు జట్టుకు కీలకమవుతాయి.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)


10-Untitled-1.jpg

రోహిత్‌ వల్లే ట్రోఫీ దూరం

దుబాయ్‌: రోహిత్‌ శర్మ అసాధారణ ఆటతీరే రెండు జట్ల మధ్య తేడా అని న్యూజిలాండ్‌ సారథి శాంట్నర్‌ విశ్లేషించాడు. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఓటమిని చేదు ముగింపుగా అభివర్ణించాడు. అయితే, బలమైన టీమ్‌ చేతిలోనే ఓడామన్నాడు. ‘రోహిత్‌ ఆటతీరే.. మాకు మ్యాచ్‌ను దూరం చేసింది. దుబాయ్‌ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకొన్న భారత్‌.. గొప్పగా ఆడింది. ఒకరకంగా ఇది మాకు మిశ్రమ ఫలితమే’ అని శాంట్నర్‌ చెప్పాడు.

కివీస్‌ కెప్టెన్‌ శాంట్నర్‌


నో విక్టరీ పరేడ్‌!

న్యూఢిల్లీ: గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ నెగ్గిన తర్వాత ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్‌ చేసింది. ఓపెన్‌ టాప్‌ బస్సులో వరల్డ్‌కప్‌ ట్రోఫీతో క్రికెటర్లు సందడి చేశారు. ఇప్పుడు చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంతో మరోసారి బస్సు యాత్ర నిర్వహిస్తారని అభిమానులు ఆశించారు. కానీ, ఈసారి అలాంటి పరేడ్‌లాంటివి ఏమీ జరపడం లేదు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్‌ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లు స్వల్ప విరామాన్ని కోరుకొంటున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌ నుంచి భారత ఆటగాళ్లు విడివిడిగా స్వస్థలాలకు చేరుకోనున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 11 , 2025 | 03:34 AM