2029 Womens World Cup: వచ్చేసారి పది జట్లు
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:12 AM
వచ్చేసారి..అంటే 2029లో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్‌లో జట్లను ప్రస్తుతమున్న 8 నుంచి 10 కి పెంచాలనీ ఐసీసీ నిర్ణయించింది. ఈమేరకు ఇక్కడ జరిగిన...
2029 మహిళల వన్డే వరల్డ్ కప్
దుబాయ్: వచ్చేసారి..అంటే 2029లో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్‌లో జట్లను ప్రస్తుతమున్న 8 నుంచి 10 కి పెంచాలనీ ఐసీసీ నిర్ణయించింది. ఈమేరకు ఇక్కడ జరిగిన ఐసీసీ బోర్డు ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. ఐసీసీ అనుబంధ సభ్య దేశాల బోర్డులకు 2026 సంవత్సరంలో 10 శాతం మేర అదనంగా నిధులు అందజేయాలని తీర్మానించింది. 2027లో జరిగే ఆఫ్రికన్, పాన్ అమెరికన్ క్రీడల జాబితాలో క్రికెట్‌ను చేర్చాలని కూడా నిర్ణయించింది.
మహిళల క్రికెట్ కమిటీలో మిథాలీ
ఐసీసీ మహిళల క్రికెట్ కమిటీకి భారత జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌ను ఎంపిక చేస్తూ ఐసీసీ మరో నిర్ణయం తీసుకుంది. మిథాలీతోపాటు ఆష్లే డిసిల్వా, అమోల్ మజుందార్, బెన్ సాయెర్, చార్లోటి ఎడ్వర్డ్స్, సాలా స్టెల్లాను కమిటీలోకి తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి