Share News

లార్డ్స్‌లో ఫైనల్‌

ABN , Publish Date - May 02 , 2025 | 02:22 AM

వచ్చే ఏడాది జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ప్రఖ్యాత లార్డ్స్‌ క్రికెట్‌ మైదానాన్ని వేదికగా ఐసీసీ ఖరారు చేసింది. 12 జట్ల పొట్టి కప్‌ 2026, జూన్‌ 12న ఆరంభం కానుండగా...

లార్డ్స్‌లో ఫైనల్‌

మహిళల టీ20 వరల్డ్‌కప్‌

వేదికలను ఖరారు చేసిన ఐసీసీ

దుబాయ్‌: వచ్చే ఏడాది జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ప్రఖ్యాత లార్డ్స్‌ క్రికెట్‌ మైదానాన్ని వేదికగా ఐసీసీ ఖరారు చేసింది. 12 జట్ల పొట్టి కప్‌ 2026, జూన్‌ 12న ఆరంభం కానుండగా.. జూలై 5న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నీలో 7 వేదికల్లో మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి. లార్డ్స్‌తోపాటు ఓల్డ్‌ ట్రాఫర్డ్‌, హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్‌, ఓవల్‌, హాంప్‌షైర్‌ బౌల్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటిదాకా 10 జట్లతో జరిగిన ఈ టోర్నీలో ఈసారి మరో 2 టీమ్‌లు అదనంగా చేరుతాయి. పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలో విడుదల చేయనుంది. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ సహా ఎనిమిది జట్లు ఈపాటికే అర్హత సాధించగా.. మిగిలిన నాలుగు బెర్త్‌లను టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ ద్వారా నిర్ణయిస్తారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 02 , 2025 | 02:22 AM