Share News

Hockey India: హాకీ ఇండియా సెంచరీ

ABN , Publish Date - Nov 08 , 2025 | 04:14 AM

భారత హాకీ సమాఖ్య..ప్రస్తుత హాకీ ఇండియా (హెచ్‌ఐ) శుక్రవారం శత వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ధ్యాన్‌చంద్‌ స్టేడియంలో వందేళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది...

Hockey India: హాకీ ఇండియా సెంచరీ

సంస్థ వందేళ్ల సంబరాలు

ఒలింపియన్లు గురుబక్ష్‌,

అస్లమ్‌కు సన్మానం

న్యూఢిల్లీ: భారత హాకీ సమాఖ్య..ప్రస్తుత హాకీ ఇండియా (హెచ్‌ఐ) శుక్రవారం శత వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ధ్యాన్‌చంద్‌ స్టేడియంలో వందేళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. హాకీ లెజెండ్స్‌, అలనాటి ఒలింపియన్లు గురుబక్ష్‌ సింగ్‌, అస్లమ్‌ షేర్‌ఖాన్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుబక్ష్‌, అస్లామ్‌తోపాటు దేశ హాకీ క్రీడకు అంతర్జాతీయంగా వన్నె తెచ్చిన ఆటగాళ్లు అజిత్‌పాల్‌ సింగ్‌, అశోక్‌ కుమార్‌, బీపీ గోవింద, జాఫర్‌ ఇక్బాల్‌, బ్రిగేడియర్‌ హరిచరణ్‌ సింగ్‌, వినీత్‌ కుమార్‌, మీర్‌ రంజన్‌ నేగి, రోమియో జేమ్స్‌, అసుంత లక్రా, సుభద్ర ప్రధాన్‌లను సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్య, కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ..వందేళ్ల హాకీ క్రీడ విశిష్ట పయనాన్ని గుర్తు చేశారు. మాండవ్య సారథ్యంలోని స్పోర్ట్స్‌ మినిస్టర్‌ లెవెన్‌, హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కే సారథ్యంలోని హాకీ ఇండియా లెవెన్‌ మధ్య స్నేహపూర్వక మ్యాచ్‌తో వందేళ్ల వేడుకలు మొదలయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లో 36 వేలమందికిపైగా పాల్గొన్నారు. ఇంకా.. వందేళ్ల హాకీ ఇండియా ప్రస్థానంపై పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య

ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 04:15 AM