Share News

India Womens Cricket: బరిలోకి హర్మన్‌ప్రీత్‌

ABN , Publish Date - Jul 01 , 2025 | 03:54 AM

ఇంగ్లండ్‌తో ఐదు టీ20లసిరీస్‌ను అదిరే విజయంతో ఆరంభించిన భారత మహిళల జట్టు నేడు (మంగళవారం) రెండో టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్‌కి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ రెండో టీ20కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

India Womens Cricket: బరిలోకి హర్మన్‌ప్రీత్‌

  • నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టీ20

  • రాత్రి 11 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..

బ్రిస్టల్‌: ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను అదిరే విజయంతో ఆరంభించిన భారత మహిళల జట్టు నేడు (మంగళవారం) రెండో టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్‌కి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఈ రెండో టీ20కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీంతో భారత బ్యాటింగ్‌ విభాగం మరింత పటిష్టం కానుంది. ఓపెనర్‌ స్మృతి మంధాన కెరీర్‌లో తొలి సెంచరీ సాధించడంతో నాటింగ్‌హామ్‌ మ్యాచ్‌లో భారత్‌ 97 పరుగుల తేడాతో నెగ్గింది. వన్‌డౌన్‌లో హర్లీన్‌ డియోల్‌ సత్తా నిరూపించుకుంది. మిడిలార్డర్‌లో జెమీమా, రిచా ఘోష్‌ నిలకడ చూపాల్సి ఉంది. ఓపెనర్‌ షఫాలీ సహజశైలిని అందుకుంటే ఇంగ్లండ్‌కు మరోసారి కష్టాలు తప్పవు. ఇక ప్రధాన బౌలర్లు రేణుకా సింగ్‌, పూజా వస్ర్తాకర్‌ లేకపోయినా బౌలింగ్‌ విభాగం అదరగొట్టింది. ముఖ్యంగా అరంగేట్రంలోనే తెలుగమ్మాయి శ్రీచరణి నాలుగు వికెట్లతో ఇంగ్లండ్‌ను వణికించింది. వెటరన్‌ స్పిన్నర్లు రాధా యాదవ్‌, దీప్తి శర్మ సైతం ప్రభావం చూపారు. కానీ ఆతిథ్య ఇంగ్లండ్‌ బౌలర్లు, బ్యాటర్లు మాత్రం ప్రభావం చూపలేదు. బ్యాటింగ్‌లో నాట్‌ సివర్‌ మాత్రమే క్రీజులో నిలిచినా తనకు సహకారమే కరువైంది. నేటి మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లండ్‌ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చి సిరీస్‌లో సమవుజ్జీగా నిలువాలనుకుంటోంది.

Updated Date - Jul 01 , 2025 | 03:54 AM