Share News

India T20 Squad: హార్దిక్‌ గిల్‌ వచ్చేశారు

ABN , Publish Date - Dec 04 , 2025 | 06:06 AM

సఫారీలతో టెస్టు సిరీస్‌ సమయంలో మెడ నొప్పికి గురైన శుభ్‌మన్‌ గిల్‌, ఆసియా కప్‌ ఫైనల్‌కు ముందు గాయపడి చాన్నాళ్లు ఆటకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తిరిగి...

India T20 Squad: హార్దిక్‌ గిల్‌ వచ్చేశారు

మళ్లీ జట్టులోకి బుమ్రా

  • సఫారీలతో టీ20 సిరీ్‌సకు టీమిండియా

రాయ్‌పూర్‌: సఫారీలతో టెస్టు సిరీస్‌ సమయంలో మెడ నొప్పికి గురైన శుభ్‌మన్‌ గిల్‌, ఆసియా కప్‌ ఫైనల్‌కు ముందు గాయపడి చాన్నాళ్లు ఆటకు దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చారు. ఈనెల 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సకు టీమిండియాను బుధవారం ప్రకటించారు. సూర్యకుమార్‌ సారథ్యంలోని 15 మంది సభ్యుల ఈ బృందానికి వైస్‌ కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేశారు. అయితే, గిల్‌ జట్టుకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ) ఇచ్చే ఫిట్‌నెస్‌ నివేదికపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. పనిభారం దృష్ట్యా వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న బుమ్రాను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. బ్యాటర్‌ రింకూ సింగ్‌పై వేటు వేశారు. సఫారీలతో ఈనెల 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్‌, చండీగఢ్‌, ధర్మశాల, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.

టీ20 జట్టు

సూర్యకుమార్‌ (కెప్టెన్‌), గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌, కుల్దీప్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌.

ఇవి కూడా చదవండి:

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 04 , 2025 | 06:06 AM