Share News

ఆరో రౌండ్‌లో హంపి గెలుపు

ABN , Publish Date - Apr 21 , 2025 | 02:57 AM

ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌ కోనేరు హంపి మహిళల గ్రాండ్‌ ప్రీ చెస్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో విజయం సాధించింది. ముంగున్‌తూల్‌ (మంగోలియా)తో ఈ రౌండ్‌లో..

ఆరో రౌండ్‌లో హంపి గెలుపు

పుణె: ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌ కోనేరు హంపి మహిళల గ్రాండ్‌ ప్రీ చెస్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో విజయం సాధించింది. ముంగున్‌తూల్‌ (మంగోలియా)తో ఈ రౌండ్‌లో 33 ఎత్తుల్లో హంపి గెలిచింది. మొత్తం 4.5 పాయింట్లతో హంపి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక, భారత్‌కే చెందిన దివ్యా దేశ్‌ముఖ్‌తో ఆరో రౌండ్‌ను ద్రోణవల్లి హారిక డ్రా చేసుకుంది. మొత్తం మూడు పాయింట్లతో హారిక ఐదో స్థానంలో నిలిచింది. దివ్య (4) మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలిపై నెగ్గిన చైనా జీఎం ఝు జినెర్‌ (5) టాప్‌లో నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2025 | 02:57 AM