Share News

హంపి-హారిక గేమ్‌ డ్రా

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:51 AM

ఇద్దరు తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి-ద్రోణవల్లి హారిక మధ్య అత్యంత ఆసక్తి రేపిన మహిళల గ్రాండ్‌ ప్రీ చెస్‌ ఐదో రౌండ్‌ గేమ్‌ డ్రా అయ్యింది...

హంపి-హారిక గేమ్‌ డ్రా

పుణె: ఇద్దరు తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి-ద్రోణవల్లి హారిక మధ్య అత్యంత ఆసక్తి రేపిన మహిళల గ్రాండ్‌ ప్రీ చెస్‌ ఐదో రౌండ్‌ గేమ్‌ డ్రా అయ్యింది. శుక్రవారం జరిగిన ఈ గేమ్‌లో హంపి-హారిక అతి జాగ్రత్తగా ఆడడంతో కేవలం 19 ఎత్తులలో ఫలితం తేలకుండా ముగిసింది. ఈ రౌండ్‌ అనంతరం హంపి (3.5 పాయింట్లు) తన రెండో స్థానాన్ని కొనసాగిస్తోంది. హారిక (2.5) ఐదో స్థానంలో నిలిచింది. ఝు జినెర్‌ (చైనా, 4) అగ్ర స్థానంలోనే నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2025 | 03:51 AM