Gukesh: గుకేష్‌కు మూడో స్థానం
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:04 AM
గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరిగిన సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో వరల్డ్ చాంపియన్ గుకేష్ ఓవరాల్‌గా 19.5 పాయింట్లతో మూడో స్థానంలో...
విజేత కార్ల్‌సన్
జాగ్రెబ్ (చెక్ రిపబ్లిక్): గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరిగిన సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో వరల్డ్ చాంపియన్ గుకేష్ ఓవరాల్‌గా 19.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా.. ప్రజ్ఞానంద 15 పాయింట్లతో 9వ స్థానం దక్కించుకొన్నాడు. కార్ల్‌సన్ 22.5 పాయింట్లతో టోర్నీ విజేతగా నిలవగా.. సో వెస్లీ (20)కి రెండోస్థానం దక్కింది. బ్లిట్జ్‌లో కార్ల్‌సన్ (12.5) అగ్రస్థానాన్ని దక్కించుకొన్నాడు. కాగా, ర్యాపిడ్‌లో 14 పాయింట్లతో విజేతగా నిలిచిన గుకేష్.. బ్లిట్జ్‌లో 18 రౌండ్ల నుంచి 5.5 పాయింట్లతో చివరిస్థానానికే పరిమితమయ్యాడు.