వన్డేలకు మాక్సీ వీడ్కోలు
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:17 AM
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు....
టీ20లలో కొనసాగుతానని ప్రకటన
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం వెల్లడించాడు. వన్డేలు ఆడేందుకు శరీరం సహకరించడంలేదని, అయినా ఈ ఫార్మాట్‌లో తాను కొనసాగితే స్వార్థపరుడినే అవుతానని చెప్పుకొచ్చాడు. మెరుపు బ్యాటింగ్‌కు మారుపేరైన 36 ఏళ్ల మ్యాక్స్‌వెల్ 149 వన్డేల్లో 3990 పరుగులు చేశాడు. దీనిలో 4 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక..భారత్ ఆతిథ్యమిచ్చి న 2023 వన్డే ప్రపంచ కప్‌లో అఫ్ఘానిస్థాన్‌పై వాంఖడే స్టేడియంలో మ్యాక్సీ ఆడిన ఇన్నింగ్స్ (201) వన్డే ఫార్మాట్‌లో గొప్ప వాటిలో ఒకటిగా నిలుస్తుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి