Share News

Indian cricket coach Gautam Gambhir: రో కో అనుభవం జట్టుకు అవసరం

ABN , Publish Date - Dec 08 , 2025 | 05:09 AM

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీ్‌సలో వైట్‌వాష్‌ అయిన భారత క్రికెట్‌ జట్టు వన్డే సిరీ్‌సలో మాత్రం ఆధిపత్యం చూపింది. ఇందుకు విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఫామ్‌ ప్రధాన కారణం.....

Indian cricket coach Gautam Gambhir: రో కో అనుభవం జట్టుకు అవసరం

  • కోచ్‌ గంభీర్‌

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీ్‌సలో వైట్‌వాష్‌ అయిన భారత క్రికెట్‌ జట్టు వన్డే సిరీ్‌సలో మాత్రం ఆధిపత్యం చూపింది. ఇందుకు విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఫామ్‌ ప్రధాన కారణం. రెండు శతకాలు, ఓ అర్ధసెంచరీతో 302 రన్స్‌ సాధించి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా నిలిచాడు. అటు సహచర ఆటగాడు రోహిత్‌ శర్మ సైతం సత్తా చూపాడు. దీనికి ముందు ఆస్ట్రేలియా పర్యటనలో హిట్‌మ్యాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా నిలవడం విశేషం. ఈ వెటరన్ల ప్రదర్శనపై ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. ‘రోహిత్‌, విరాట్‌ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లే కాకుండా.. వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ అగ్రశ్రేణి క్రికెటర్లు. వారి అనుభవం డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తాము ఎలా ఆడితే జట్టుకు ప్రయోజనమో వారికి తెలుసు. కొన్నేళ్లుగా భారత క్రికెట్‌ తరఫున అలాంటి ప్రదర్శననే కొనసాగిస్తున్నారు. మున్ముందు కూడా ఇదే జోరును చూపాలని కోరుకుంటున్నా’ అన్నాడు.. అయితే 2027 వన్డే వరల్డ్‌క్‌పలో రోహిత్‌-కోహ్లీలు ఆడతారా అన్న విషయాన్ని మాత్రం గంభీర్‌ దాటేశాడు. ‘ఇంకా రెండేళ్లున్న వరల్డ్‌కప్‌ గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుంది. వర్తమానంలో ఉండడం ముఖ్యం. రుతురాజ్‌, జైస్వాల్‌ లాంటి యువ ఆటగాళ్లు తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు’ అని గంభీర్‌ వివరించాడు. ఇదిలావుండగా ఇతరులకన్నా రోహిత్‌, విరాట్‌లను భిన్నంగా చూడాలని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సూచించాడు. యువ ప్లేయర్ల వలె ఈ జోడీకి ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదన్నాడు.

Updated Date - Dec 08 , 2025 | 05:09 AM