Gautam Gambhir: ప్రస్తుతానికి గౌతీ సేఫ్
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:15 AM
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్‌వాష్ కావడంతో హెడ్ కోచ్ గౌతమ్ గం భీర్‌పై విమర్శలు వెల్లువెత్తా యి. అయితే బీసీసీఐ గంభీర్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. గంభీర్‌పై హడావుడిగా ఎటువంటి...
గంభీర్‌కు అండగా బీసీసీఐ
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్‌వాష్ కావడంతో హెడ్ కోచ్ గౌతమ్ గం భీర్‌పై విమర్శలు వెల్లువెత్తా యి. అయితే బీసీసీఐ గంభీర్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. గంభీర్‌పై హడావుడిగా ఎటువంటి చర్యలూ తీసుకోబోమని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పాడు. రోహిత్, కోహ్లీ, అశ్విన్ రిటైర్మెంట్‌తో జట్టు సంధి దశలో ఉందని.. మళ్లీ పుంజుకోవడానికి సమటయం పడుతుందని అన్నాడు. ఆటగాళ్లు ఎటువంటి పిచ్‌లపైనైనా ఆడే విధానాన్ని అలవర్చుకోవాలని సూచించాడు. కాగా గంభీర్‌కు సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు. జట్టు ఓటమిపాలైతే కోచ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించాడు. గెలిచినప్పుడు అతడికి క్రెడిట్ ఇవ్వనప్పుడు.. ఓటమికి విమర్శలెందుకు చేస్తున్నారో వివరించాలని సన్నీ కోరాడు.
ఇవి కూడా చదవండి:
బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!
కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ