Share News

భారత క్రికెట్‌ ఎవరి సొత్తూ కాదు

ABN , Publish Date - May 07 , 2025 | 04:28 AM

‘భారత క్రికెట్‌ ఎవడబ్బ సొత్తూ కాద’ని టీమిండియా చీఫ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. తన కోచింగ్‌పై విమర్శలు చేస్తున్న మాజీ ఆటగాళ్లకు ఘాటుగా బదులిచ్చాడు. ‘కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడే...

భారత క్రికెట్‌ ఎవరి సొత్తూ కాదు

విమర్శకులకు గంభీర్‌ ఘాటు కౌంటర్‌

న్యూఢిల్లీ: ‘భారత క్రికెట్‌ ఎవడబ్బ సొత్తూ కాద’ని టీమిండియా చీఫ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. తన కోచింగ్‌పై విమర్శలు చేస్తున్న మాజీ ఆటగాళ్లకు ఘాటుగా బదులిచ్చాడు. ‘కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడే.. ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుసు. దేశం గర్వపడేలా చేయడమే నా పని. అంతేకానీ ఏసీ గదుల్లో కూర్చొని కామెంట్రీ పేరుతో ఏదో మాట్లాడే వారిని ప్రసన్నం చేసుకోవడం కాదు’ అని కౌంటర్‌ ఇచ్చాడు. కొందరు మాజీలు భారత క్రికెట్‌ను సొంత ఆస్తిలా భావిస్తున్నారన్నాడు. ‘కొందరు 25 ఏళ్లుగా కామెంట్రీ బాక్స్‌లో తిష్టవేసుకొని కూర్చొన్నారు. భారత క్రికెట్‌ ఏదో వారి కుటుంబ ఆస్తి అని అనుకొంటున్నారు. కానీ, ఇదంతా భారత ప్రజలది అనే వాస్తవాన్ని గుర్తించాలి’ అని గౌతీ అన్నాడు. ఇక, ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు ఎంపికలో తన జోక్యం ఏమీలేదన్నాడు. రోహిత్‌, కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేస్తున్నంత కాలం జట్టులో కొనసాగే అర్హత ఉంటుందని చెప్పాడు. జట్టు ఎంపికలో తన పాత్ర లేదని.. అంతా సెలెక్టర్లదేనని గంభీర్‌ తెలిపాడు.


పాక్‌తో ఎక్కడా ఆడొద్దు

పహల్గాం దాడి నేపథ్యంలో.. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలకనంత వరకు పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని గంభీర్‌ డిమాండ్‌ చేశాడు. ఆసియాకప్‌, ఐసీసీ ఈవెంట్లలో కూడా పాక్‌తో ఆడకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2025 | 04:28 AM