విదేశీ ఆటగాళ్లకై ఎదురుచూపులు
ABN , Publish Date - May 14 , 2025 | 04:27 AM
ఈనెల 17 నుంచి ఐపీఎల్ తిరిగి ఆరంభం కానుండడంతో విదేశీ ఆటగాళ్ల రాకపై అందరి దృష్టీ నెలకొంది. భారత్-పాక్ యుద్ధం కారణంగా వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణతో...
ఐపీఎల్‌కు స్టొయినిస్, ఇన్‌గ్లి్‌స దూరం
న్యూఢిల్లీ: ఈనెల 17 నుంచి ఐపీఎల్ తిరిగి ఆరంభం కానుండడంతో విదేశీ ఆటగాళ్ల రాకపై అందరి దృష్టీ నెలకొంది. భారత్-పాక్ యుద్ధం కారణంగా వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణతో పరిస్థితులు మారడంతో ఎలాగైనా విదేశీ క్రీడాకారులను భారత్‌కు రప్పించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఇందుకు పలువురు ఆటగాళ్లు అంతగా సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. అంతేకాకుండా తమ ప్లేయర్ల భద్రత ముఖ్యమనే ఆలోచనలో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఉన్నాయి. వారిని ఒప్పించే బాధ్యతను ఐపీఎల్ సీవోవో హేమంగ్ అమిన్‌కు బోర్డు అప్పగించింది. తను ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులతో ఇదే విషయమై చర్చించాడు. ‘విదేశీ క్రికెట్ బోర్డులతో నేరుగా మాట్లాడుతున్నాం. ఫ్రాంచైజీలు కూడా తమ ఆటగాళ్లతో టచ్‌లో ఉన్నారు. మెజారిటీ క్రికెటర్లు భారత్‌కు వస్తారనే ఆశిస్తున్నాం’ అని బోర్డు అధికారి పేర్కొన్నాడు. మరోవైపు ఆసీస్ ఆటగాళ్లలో స్టొయినిస్, ఇన్‌గ్లి్‌స పంజాబ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. వారిని ఒప్పించేందుకు కోచ్ పాంటింగ్ ప్రయత్నిస్తున్నాడు. ఢిల్లీ కీలక పేసర్ స్టార్క్ ఇక్కడికి వచ్చేందుకు అయిష్టత వ్యక్తం చేశాడు. కమిన్స్, హెడ్ మాత్రం జట్టులో చేరతారని ఆశిస్తున్నట్టు రైజర్స్ యాజమాన్యం పేర్కొంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..