Gautam Gambhir: కోచింగ్‌ను వదిలెయ్
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:17 AM
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీ్‌సను కోల్పోవడంతో భారత కోచ్ గంభీర్‌పై అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. రెండో టెస్టు ముగిశాక ప్రేక్షకులు అతడిని...
రాంచీ: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీ్‌సను కోల్పోవడంతో భారత కోచ్ గంభీర్‌పై అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. రెండో టెస్టు ముగిశాక ప్రేక్షకులు అతడిని గేలి చేయడం కనిపించింది. తాజాగా తొలి వన్డేకు ముందు రాంచీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లోనూ గౌతీకి చేదు అనుభవం ఎదురైంది. ‘న్యూజిలాండ్ చేతిలో 0-3, సౌతాఫ్రికా చేతిలో 0-2 తేడాతో ఓడిపోయాం. గంభీర్ నువ్వు కోచింగ్‌ను వదిలేయ్. సొంతగడ్డపైనే సఫారీలపై గెలవలేమని భావిస్తే.. ఇక 2027 వరల్డ్‌క్‌పను మర్చిపోవాల్సిందే’ అని స్టాండ్స్ నుంచి ఓ ప్రేక్షకుడు గట్టిగా అరిచాడు.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?