U19 Cricket Match: ఇంగ్లండ్‌దే రెండో వన్డే
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:23 AM
భారత్ అండర్-19 జట్టుతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో యూత్ వన్డేలో ఇంగ్లండ్ ఆఖరి ఓవర్‌లో గట్టెక్కింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వికెట్ తేడాతో నెగ్గిన ఆతిథ్య జట్టు...
వికెట్ తేడాతో భారత యువ జట్టు ఓటమి
నార్తాంప్టన్: భారత్ అండర్-19 జట్టుతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో యూత్ వన్డేలో ఇంగ్లండ్ ఆఖరి ఓవర్‌లో గట్టెక్కింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వికెట్ తేడాతో నెగ్గిన ఆతిథ్య జట్టు.. ఐదు వన్డేల సిరీ్‌సలో 1-1తో సమంగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత కుర్రాళ్లు 49 ఓవర్లలో 290 పరుగులు సాధించారు. విహాన్ (49), రాహుల్ (47), వైభవ్ (45), కనిష్క్ (45), అభిగ్యాన్ (32) రాణించారు. ఫ్రెంచ్‌కు నాలుగు.. గ్రీన్, హోమ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్ అండర్-19 జట్టు 49.3 ఓవర్లలో 291/9 స్కోరు చేసింది. ఓ దశలో 47/3 స్కోరుతో తడబడినా.. కెప్టెన్ థామస్ రూ (131) అద్భుత సెంచరీతో జట్టును విజయం వైపు నడిపించాడు. చివర్లో వేగంగా వికెట్లు కోల్పోయినా ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులను తొలి మూడు బంతుల్లోనే సాధించి భారత్‌కు ఝలక్ ఇచ్చింది. రాకీ (39), సెబాస్టియన్ (20 బ్యాటింగ్) ఆకట్టుకున్నారు. పేసర్లు అంబరీ్‌షకు నాలుగు.. హెనిల్ పటేల్, యుధజిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.