England U 19: డ్రాతో గట్టెక్కిన ఇంగ్లండ్
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:21 AM
భారత్ అండర్-19తో జరిగిన తొలి అనధికార టెస్టులో ఇంగ్లండ్ డ్రాతో గట్టెక్కింది. యువ భారత్ నిర్దేశించిన 350 పరుగుల ఛేదనలో...
భారత్ అండర్-19తో అనధికార టెస్టు
బెకెన్‌హామ్: భారత్ అండర్-19తో జరిగిన తొలి అనధికార టెస్టులో ఇంగ్లండ్ డ్రాతో గట్టెక్కింది. యువ భారత్ నిర్దేశించిన 350 పరుగుల ఛేదనలో.. ఓవర్‌నైట్ స్కోరు 128/3తో చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 270/7 స్కోరు చేసింది. కెప్టెన్ హమ్జా షేక్ (112) శతకంతో రాణించగా.. బెన్ మేయర్స్ (51), థామస్ (50) రాణించారు. అంబ్రిష్ 2 వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 540, రెండో ఇన్నింగ్స్‌లో 248 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 439 రన్స్‌కు ఆలౌటైంది.
ఇవీ చదవండి:
లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి