Cricket Highlights: ఇంగ్లండ్ హ్యాట్రిక్
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:47 AM
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ వరుసగా మూడో విజయం సాధించింది. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (117) రికార్డు శతకానికి తో....
బ్రంట్ సెంచరీ
శ్రీలంకపై విజయం
కొలంబో: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ వరుసగా మూడో విజయం సాధించింది. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (117) రికార్డు శతకానికి తోడు స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (4/17) సూపర్ బౌలింగ్‌తో సత్తా చాటడంతో.. ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో 253/9 స్కోరు చేసింది. బ్రంట్‌కు తోడు బ్యూమంట్ (32), హీథర్ నైట్ (29) రాణించారు. వన్డే వరల్డ్‌క్‌ప చరిత్రలో సివర్‌కు ఇది రికార్డుస్థాయిలో ఐదో శతకం కావడం విశేషం. ఇనోకకు 3.. ఉదేశిక, సుగందికలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో శ్రీలంక 45.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హాసిని (35), హర్షిత (33), నీలాక్షి (23) మాత్రమే ఆకట్టుకున్నారు. సివర్ బ్రంట్, డీన్‌లకు రెండేసి వికెట్లు లభించాయి.