పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్?
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:45 AM
భారత్-ఇంగ్లండ్ ద్వైపాక్షిక సిరీస్ విజేతకు ప్రదానం చేసే మన్సూర్ అలీఖాన్ (ఎంఏకే) పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ ఇచ్చే యోచనలో...
న్యూఢిల్లీ: భారత్-ఇంగ్లండ్ ద్వైపాక్షిక సిరీస్ విజేతకు ప్రదానం చేసే మన్సూర్ అలీఖాన్ (ఎంఏకే) పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ ఇచ్చే యోచనలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఉన్నట్టు సమాచారం. ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని 2007లో ఈ ట్రోఫీని ఆరంభించారు. అయితే, ఈసీబీ నిర్ణయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా లేదు. కానీ, ఈ ట్రోఫీ స్థానంలో ఇరు దేశాలకు చెందిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల పేరున కొత్త ట్రోఫీని ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. పటౌడీ కుటుంబ సభ్యులకు ఈ మేరకు సమాచారం ఉందట. టెస్టు సిరీ్‌సలో భాగంగా జూన్-జూలైలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..