Share News

కోహ్లీ లేకపోవడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:44 AM

బ్లాక్‌బస్టర్‌లాంటి టెస్ట్‌ సిరీ్‌సలో విరాట్‌ కోహ్లీవంటిగొప్ప ఆటగాడిని ఎదుర్కోలేకపోవడం ఎంతో విచారకరమని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. కోహ్లీ లేని భారత జట్టులో...

కోహ్లీ లేకపోవడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌

లీడ్స్‌: బ్లాక్‌బస్టర్‌లాంటి టెస్ట్‌ సిరీ్‌సలో విరాట్‌ కోహ్లీవంటిగొప్ప ఆటగాడిని ఎదుర్కోలేకపోవడం ఎంతో విచారకరమని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. కోహ్లీ లేని భారత జట్టులో మునుపటి పోరాటతత్వం, గెలవాలన్న తపన సన్నగిల్లుతాయని అన్నా డు. టెస్ట్‌ ఫార్మాట్‌కు గత నెలలో విరాట్‌ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అంతకుముందు కొద్ది రోజుల కిందటే రోహిత్‌ శర్మ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దాంతో సంధి దశలో ఉన్న భారత జట్టు యువ కెప్టెన్‌ గిల్‌ ఆధ్వర్యంలో ఇంగ్లండ్‌ను ఐదు టెస్ట్‌ల్లో ఢీకొనబోతోంది. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) విడుదల జేసిన ఓ వీడియోలో స్టోక్స్‌...కోహ్లీ నిష్క్రమణపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. మైదానంలో తామిద్దరిదీ ఒకే తరహా మైండ్‌సెట్‌ అనీ, అతనితో తలపడే అవకాశం లభించకపోవడం తనకే మాత్రం నచ్చడంలేదని స్టోక్స్‌ చెప్పాడు. ఇదే విషయాన్ని కోహ్లీకి మెసేజ్‌ చేశానని అన్నాడు. ‘జెర్సీ నెంబర్‌ 18ని విరాట్‌ తనదిగా చేసుకున్నాడు. ఇకపై ఆ నెంబర్‌ ఏ భారత జట్టు క్రికెటర్‌ జెర్సీపైనా కనిపించకపోవడాన్ని జీర్ణించుకోవడం కష్టమే. కోహ్లీ ఆ నెంబర్‌కు అంతలా వన్నె తెచ్చాడు’ అని బెన్‌ చెప్పుకొచ్చాడు.


విరాట్‌లేని లోటు సుస్పష్టం: బాయ్‌కాట్‌

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సలో రోహిత్‌ శర్మకన్నా విరాట్‌ కోహ్లీలేని లోటు భారత్‌కు స్పష్టంగా కనిపిస్తుందని దిగ్గజ బ్యాటర్‌ బాయ్‌కాట్‌ అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లీ లేకపోవడం టీమిండియాపై పెను ప్రభావం చూపుతుంది’ అన్నాడు.

ఇవీ చదవండి:

పిచ్‌తో భయపెడుతున్న ఇంగ్లండ్

నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..

18 నంబర్ జెర్సీ.. సిరీస్‌‌లో ఇదే హైలైట్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 03:44 AM