India Fights Back: రసపట్టులో
ABN , Publish Date - Aug 04 , 2025 | 02:56 AM
ఓవల్ టెస్టులో హైటెన్షన్.. నాలుగో రోజే ముగుస్తుందనుకున్న మ్యాచ్ ఆఖర్లో వర్షం ఇచ్చిన ట్విస్ట్‌కు ఐదో రోజుకు చేరింది. అయితే హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అద్భుత శతకాలతో...
విజయానికి 35 రన్స్ దూరంలో ఇంగ్లండ్
4 వికెట్ల వేటలో భారత్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 339/6
రూట్, బ్రూక్ శతక మోత
లండన్: ఓవల్ టెస్టులో హైటెన్షన్.. నాలుగో రోజే ముగుస్తుందనుకున్న మ్యాచ్ ఆఖర్లో వర్షం ఇచ్చిన ట్విస్ట్‌కు ఐదో రోజుకు చేరింది. అయితే హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అద్భుత శతకాలతో ఆఖరి మ్యాచ్‌నే కాదు, సిరీస్ కూడా కోల్పోయినట్టే అనుకున్న వేళ.. భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. చివరి సెషన్‌లో కేవలం 57 పరుగుల కోసం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును భారత పేసర్లు వణికించారు. ప్రసిద్ధ్ కృష్ణ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి భారత్ విజయంపై ఆశలు రేపాడు. అయితే వర్షం రావడంతో గంటన్నర ముందుగానే ఆటను ముగించారు. విజయానికి ఇంగ్లండ్ 35 పరుగుల దూరంలో ఉండగా.. వోక్స్ బరిలోకి దిగితే భారత్‌కు మరో 4 వికెట్లు కావాల్సిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 339/6 స్కోరుతో ఉండగా.. క్రీజులో జేమీ స్మిత్ (2), ఒవర్టన్ (0) ఉన్నారు. ప్రసిద్ధ్‌కు మూడు, సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. సోమవారం తొలి గంట ఆట ఇరు జట్లలో విజయం ఎవరిదో తేల్చనుంది.
పోటీ సమంగా..: ఓవర్‌నైట్ స్కోరు 50/1తో నాలుగో రోజు ఇంగ్లండ్ భారీ ఛేదనను ఆరంభించింది. అయితే ఈ సెషన్‌లో ఇరుజట్ల నుంచి పోటాపోటీ ప్రదర్శన ఎదురైంది. ముఖ్యంగా పేసర్ సిరాజ్ అలుపెరుగని ఎనిమిది ఓవర్ల స్పెల్‌తో డకెట్, పోప్‌లను ఇబ్బందిపెట్టాడు. అయితే జోరుమీదున్న డకెట్‌ను తొలి గంటలోనే ప్రసిద్ధ్ అవుట్ చేశాడు. అటు పోప్ మాత్రం ప్రసిద్ధ్ ఓవర్‌లో మూడు ఫోర్లు రాబట్టాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే అతడిని సిరాజ్ అవుట్ చేశాడు. ఇక బ్రూక్ నిలదొక్కుకునేందుకు కాస్త సమయం తీసుకున్నా.. ఆకాశ్ ఓవర్‌లో 4,6తో టచ్‌లోకి వచ్చాడు. తర్వాతి ఓవర్‌లోనే 6,4,4తో 16 రన్స్ పిండుకున్నాడు. ఈ సెషన్‌లో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయినా 114 పరుగులు రాబట్టింది.
బ్రూక్ భళా: రెండో సెషన్‌లో ఇంగ్లండ్ తమ బాజ్‌బాల్ గేమ్‌ను బయటికి తీసింది. విజయానికి 210 పరుగుల దూరంలో ఉండగా.. బ్రూక్ ఒక్కసారిగా బ్యాట్‌కు పనిజెప్పాడు. దీంతో సెషన్ ముగిసేసరికి అతను అద్భుత శతకం పూర్తిచేసుకోగా.. అటు రూట్ 98 రన్స్‌తో బ్రేక్‌కు వెళ్లాడు. దీంతో.. ఇంగ్లండ్ విజయానికి కేవలం 57 పరుగుల దూరంలో నిలిచి భారత్‌లో ఓటమి భయాన్ని పెంచింది. కాగా.. ఆరంభ ఓవర్‌లోనే బ్రూక్ రెండు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటాడు. అటు భారత పేసర్లు తీవ్రంగా అలసిపోయినట్టు కనిపించారు. ఈ క్రమంలో 39 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన బ్రూక్, ఆ తర్వాత కూడా చెలరేగి 91 బంతుల్లో కెరీర్‌లో పదో శతకం అందుకున్నాడు. అయితే ఆ వెంటనే ఆకాశ్ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లు బాది మిడా్‌ఫలో సిరాజ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. అప్పటికే రూట్‌తో కలిసి అతను నాలుగో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ఈ సెషన్ ముగియగానే వర్షం రావడంతో ఆఖరి సెషన్ పది నిమిషాలు ఆలస్యంగా ఆరంభమైంది.
బౌలర్లు పుంజుకుని..: చివరి సెషన్‌లో పట్టు వీడని భారత బౌలర్లు మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. ఈ సెషన్ ఆరంభంలోనే రూట్ శతకాన్ని పూర్తి చేయగా.. మరో ఎండ్‌లో బెథెల్ (5) నిర్లక్ష్యపు షాట్‌తో భారత్‌కు చాన్స్ ఇచ్చాడు. బెథెల్‌ను ప్రసిద్ధ్ బౌల్డ్ చేశాడు. అటు బంతి కూడా చక్కగా మూవ్ కావడంతో బౌలర్లకు పట్టు దొరికింది. సిరాజ్ కూడా వికెట్లను లక్ష్యంగా చేసుకుని బంతులు విసరడంతో ఇంగ్లండ్‌కు పరుగులు రావడమే గగనమైంది. 39వ టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్న రూట్ వికెట్‌ను కూడా ప్రసిద్ధ్ తీయడంతో భారత్‌కు మ్యాచ్‌పై పట్టు లభించింది. ఆట ఆగే సమయానికి చివరి ఆరు ఓవర్లలో ఇంగ్లండ్ 8 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 224;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247;
భారత్ రెండో ఇన్నింగ్స్: 396;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలే (బి) సిరాజ్ 14, డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిద్ధ్ 54, పోప్ (ఎల్బీ) సిరాజ్ 27, రూట్ (సి) జురెల్ (బి) ప్రసిద్ధ్ 105, బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్ 111, బెథెల్ (బి) ప్రసిద్ధ్ 5, స్మిత్ (బ్యాటింగ్) 2, ఒవర్టన్ (బ్యాటింగ్) 0, ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: 76.2 ఓవర్లలో 339/6; వికెట్ల పతనం: 1-50, 2-82, 3-106, 4-301, 5-332, 6-337; బౌలింగ్: ఆకాశ్ దీప్ 20-4-85-1, ప్రసిద్ధ్ కృష్ణ 22.2-3-109-3, సిరాజ్ 26-5-95-2, వాషింగ్టన్ సుందర్ 4-0-19-0, జడేజా 4-0-22-0.
1
భారత్‌తో జరిగిన సిరీ్‌సల్లో ఎక్కువ సార్లు (3) 500+ పరుగులు చేసిన బ్యాటర్‌గా జో రూట్. అలాగే ఒకే జట్టు (భారత్)పై ఎక్కువ (13) సెంచరీలు బాదిన రెండో బ్యాటర్‌గా గవాస్కర్ (విండీ్‌సపై)తో రూట్ సమంగా నిలిచాడు. బ్రాడ్‌మన్ (ఇంగ్లండ్‌పై 19) టాప్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా స్వదేశంలో ఎక్కువ (24) సెంచరీలు సాధించిన ప్లేయర్‌గానూ రూట్ రికార్డులకెక్కాడు. అంతేకాదు.. ఛేజింగ్‌లో ఎక్కువ (13) 50+ స్కోర్లలోనూ గేల్, చందర్‌పాల్, గ్రేమ్ స్మిత్‌తో సమంగా నిలిచాడు.
1
ఓ టెస్టు సిరీ్‌సలో 9 మంది బ్యాటర్లు 400+ స్కోరు నమోదు చేయడం ఇదే తొలిసారి. అలాగే వీరి నుంచి రికార్డు స్థాయిలో 21 శతకాలు రావడం విశేషం.
ఇవి కూడా చదవండి..
గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..
ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..