ఎలవెనిల్ గోల్డెన్ షూట్
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:26 AM
ఐ ఎస్ ఎస్ ఎఫ్ వరల్డ్ కప్‌ను భారత్ ఘనంగా ప్రారంభించింది. మంగళవారం ఇక్కడ మొదలైన ఈ మెగా టోర్నీలో భారత షూటర్ ఎలవెనిల్ వలరివన్ పతకం కొల్లగొట్టింది

ప్రపంచక్‌పలో పసిడి కైవసం
మ్యూనిచ్ (జర్మనీ): ఐ ఎస్ ఎస్ ఎఫ్ వరల్డ్ కప్‌ను భారత్ ఘనంగా ప్రారంభించింది. మంగళవారం ఇక్కడ మొదలైన ఈ మెగా టోర్నీలో భారత షూటర్ ఎలవెనిల్ వలరివన్ పతకం కొల్లగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. ఫైనల్స్‌లో 25 ఏళ్ల ఎలవెనిల్ 231.2 పాయింట్లు షూట్ చేసి మూడోస్థానంతో పోడియం ఫినిష్ చేసింది. చైనా షూటర్ వాంగ్ జిఫీ (252.7) స్వర్ణం, కొరియాకు చెందిన క్వాన్ ఎన్‌జి (252.6) రజతం గెలుచుకున్నారు. ఇక, మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్స్‌లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ నాలుగో స్థానంలో నిలవగా.. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాల విజేత మనూ భాకర్ 12వ స్థానానికి పరిమితమైంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి