Share News

Laureus Awards: లారెస్‌ విజేతలు డుప్లాంటిస్‌, బైల్స్‌

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:18 AM

ప్రతిష్ఠాత్మక లారెస్‌ ప్రపంచ క్రీడా అవార్డుల్లో 2024కి గాను పురుషుల విభాగంలో స్వీడన్‌ పోల్‌వాల్టర్‌ ఆర్మండ్‌ డుప్లాంటిస్‌, మహిళల విభాగంలో అమెరికా జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ విజేతలుగా నిలిచారు

Laureus Awards: లారెస్‌ విజేతలు డుప్లాంటిస్‌, బైల్స్‌

మాడ్రిడ్‌: ప్రతిష్ఠాత్మక లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును స్వీడన్‌ పోల్‌వాల్టర్‌ మాండో డుప్లాంటిస్‌(25) సొంతం చేసుకొన్నాడు. సోమవారం ఇక్కడ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒలింపిక్‌ స్వర్ణాన్ని నిలబెట్టుకొన్న డుప్లాంటిస్‌.. తన ప్రపంచ రికార్డును తనే అధిగమించాడు. కాగా, స్పోర్ట్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా అమెరికా జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ నిలిచింది. ఇక.. ‘కమ్‌ బ్యాక్‌ ఆఫ్‌ ఇయర్‌’ అవార్డు రేసులో నిలిచిన టీమిండియా క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు నిరాశే ఎదురైంది. ఈ పురస్కారాన్ని బ్రెజిల్‌ జిమ్నాస్ట్‌ రెబెక్కా ఆండ్రెడె దక్కించుకొంది.

Updated Date - Apr 22 , 2025 | 03:22 AM